సీమకు అన్యాయం చేస్తే?

ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా ఇంకా గందరగోళంలోనే ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు.

Update: 2021-11-24 02:34 GMT

ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా ఇంకా గందరగోళంలోనే ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమకు న్యాయ చేస్తూనే అమరావతిని కొనసాగించాలని ఆయన సూచించారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు. కర్నూలులో వేసవి లేదా శీతాకాల రాజధానిని ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు.

మినీ సెక్రటేరియట్ ను....
రాయలసీమ అనేక సార్లు తనకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయిందని, ఈసారి అలా కాకుండా న్యాయం చేయాలని జగన్ కు టీజీ వెంకటేష్ సూచించారు. విశాఖలో పరిపాలన రాజధాని అంటే రాయలసీమ వాసులకు దూరం అవుతుందని, కర్నూలులో మినీ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. మూడు రాజధానులపై మళ్ల ీచట్టం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని టీజీ వెంకటేష్ సూచించారు.


Tags:    

Similar News