ఏపీ లోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన.. మరి తెలంగాణ?

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వచ్చే మూడు రోజుల

Update: 2023-08-21 05:37 GMT

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అయితే గుంటూరు, కృష్ణ, బాపట్ల, ఏలూరు, అల్లూరి, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరీంగర్, కామారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉంది.


Tags:    

Similar News