సింహాద్రి ఎక్స్ ప్రెస్ రెండు రోజులు రద్దు

సింహాద్రి ఎక్స్ ప్రెస్ ను రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు

Update: 2025-03-01 03:01 GMT

సింహాద్రి ఎక్స్ ప్రెస్ ను రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పనులు జరుగుతున్న కరారణంగా ఈ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 3వ తేదీ వరకూ రద్దు చేసినట్లు తెలిపారు. కడియం, ద్వారపూడి, అనపర్తి రైల్వే స్టేషన్ల మధ్య నాన్ - ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా నేటి నుంచి సింహాద్రి నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ట్రాక్ పనుల కారణంగానే...
రైల్వే ట్రాక్ పనుల మరమ్మతుల కారణంగానే తాత్కాలికంగానే రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రెండు రోజుల పాటు ప్రయాణికులు అసౌకర్యాన్ని గుర్తించాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 1,2 తేదీల్లో గుంటూరు విశాఖపట్నం, రెండు, మూడు తేదీల్లో విశాఖపట్నం, గుంటూరు మధ్య సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైళ్లు తిరగవని రైల్వే శాఖ తెలిపింది.


Tags:    

Similar News