తిరుమలలో సండే రష్.. దర్శనానికి ?

శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయి.. క్యూకాంప్లెక్స్ వెలుపలికి క్యూలైన్లు వచ్చాయి.

Update: 2023-07-16 04:28 GMT

తిరుమలలో మామూలు రోజుల్లో కంటే.. వీకెండ్ లో రష్ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులతో నిండిపోయి.. క్యూకాంప్లెక్స్ వెలుపలికి క్యూలైన్లు వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. క్యూలైన్లలో వేచి ఉన్నభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

శనివారం శ్రీవారిని 87,171 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే 38,273 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం.. టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో నిత్యాన్నదానానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది.


Tags:    

Similar News