నేడు గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం

గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

Update: 2025-07-26 02:26 GMT

గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా గోవా రాష్ట్రానికి అశోక్ గజపతిరాజు చేరుకున్నారు. . గోవా గవర్నర్ గా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ గజపతి రాజును నియమించిన సంగతి తెలిసిందే. గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అశోక్ వెంట...
అశోక్ గజపతి రాజు వెంట వంద మంది అభిమానులు పయనమయి బయలుదేరి గోవాకు చేరుకున్నారు. భారీ సెక్యూరిటీ నడుమ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి అశోక్ గజపతి రాజు చేరుకున్నారు. విశాఖ నుండి హైదరాబాద్ కు...హైదరాబాద్ నుండి గోవా కు అశోక్ గజపతి రాజు కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య గోవాకు చేరుకున్న అశోక్ గజపతిరాజుకు అధికారులు, పాలకులు స్వాగతం పలికారు.


Tags:    

Similar News