YSRCP : నేడు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన జరుగుతుంది

Update: 2025-11-12 01:57 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేడు వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలునిర్వహించాలని ఇప్పటికే వైసీపీ పార్టీ నాయకత్వం ఆదేశించిన నేపథ్యంలో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ర్యాలీలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను మానుకోవాలని కోరనున్నారు.

175 నియోజకవర్గాల్లో...
ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలసి వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొనాలని జగన్ ఆదేశించారు. అయితే ర్యాలీలకు రాష్ట్రంలో అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Tags:    

Similar News