Narendra Modi : నేడు విశాఖకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నానికి రానున్నారు. రాత్రికి ఇక్కడ బస చేసి రేపు యోగా డే కార్యక్రమంలో పాల్గొననున్నారు

Update: 2025-06-20 02:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నానికి రానున్నారు. ఒడిశాలో పర్యటించిన అనంతరం నేటి సాయంత్రం మోదీ విశాఖపట్నానికి చేరుకుంటారు. రాత్రికి విశాఖలోనే బస చేయనున్నారు. జూన్ 21వ తేదీ ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో నిర్వహించే జాతీయ యోగా డే దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

యోగా డే కార్యక్రమంలో పాల్గొని...
దాదాపు ఐదు లక్షల మందితో జరిగే ఈ కార్యక్రమంలో మోదీ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. మోదీ నేడు విశాఖపట్నానికి వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ఆయనకు స్వాగతం పలికేందుకు నేడు విశాఖపట్నానికి వెళ్లనున్నారు. యోగా డే కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. మోదీ రాక సందర్భంగా విశాఖపట్నంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News