Narendra Modi : నేడు అమరావతికి ప్రధాని మోదీ రాక.. రాజధాని పనులకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమరావతికి రానున్నారు. రాజధాని పనులతో పాటు వివిధ పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు

Update: 2025-05-02 04:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అమరావతికి రానున్నారు. రాజధాని పనులతో పాటు వివిధ పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. కొన్ని పనులను జాతికి అంకితం చేయనున్నారు. నేడు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఈ రకంగా ఉంది. తిరువంతపురం నుంచి నేరుగా మధ్యాహ్నం 2.55కి గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. ప్రధాని మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెలగపూడికి హెలికాప్టర్ లో బయలుదేరి మోదీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.15కి వెలగపూడి చేరుకోనన్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3.30కి సభస్థలి ప్రధాని మోదీ చేరుకోనున్నారు.

గంటా పదిహేను నిమిషాలు...
రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు కేంద్ర ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేయనున్నారు. గంట 15 నిమిషాలపాటు సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ సభ అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్.పి.జి నిఘా ఉందచింది. ఆ ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. ప్రధాని మోదీ పర్యటనకు అనుమతి ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రతిదీ మినిట్ టు మినిట్ కార్యక్రమం జరుగుతుండటంతో దాని ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది. మధ్యలో ఎవరూ దూరినా వెంటనే ఎస్.పి.జి అదుపులోకి తీసుకుంటుందని హెచ్చరించారు. అందుకే ముందుగానే ప్రధాని పర్యటనలో పాల్గొనే వారి వివరాలను ఎన్.పి.జి. తీసుకుంది.
భారీ ఆశలు...
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి అమరావతికి వస్తుండటంతో ఆయన ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కేవలం మట్టి, నీరు తేవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈసారి అలా కాకుడండా నిధులను మంజూరు చేసి అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ సహకరిస్తారని చెబుతున్నారు. అయితే నిధుల ప్రకటన ఏ రూపంలో ఉంటుందన్నది తెలియకపోయినా భారీ స్థాయిలోనే ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. సూపర్ గిఫ్ట్ ఈసారి ఏపీ వాసులకు మోదీ అందిస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి. మరి మోదీ ఎప్పటిలాగానే ప్రశంసలతో ముంచెత్తి వెళ్లిపోతారా? లేక అమరావతికి ఉపయోగపడే ఏదైనా ప్రకటన భారీ గిఫ్ట్ రూపంలో ఉంటుందా? అన్న అనుమానం మాత్రం కూటమి నేతల్లో ఉంది.
Tags:    

Similar News