Amaravathi: రాజధాని పనులకు మోదీ శంకుస్థాపన

అమరావతి రాజధాని పనుల పునర్మిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

Update: 2025-05-02 10:43 GMT

అమరావతి రాజధాని పనుల పునర్మిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దాదాపు యాభై మూడు వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో పాటు మంత్రులు స్వాగతం పలికారు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న...
తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెలగపూడికి చేరుకున్న మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలికారు. సభా వేదికపైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 57,940 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం పద్దెనిమిది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. అమరావతి పునర్నిర్నాణ పనులకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు తరలి వచ్చారు.


Tags:    

Similar News