పీఆర్సీపై చర్చలకు ఉద్యోగ సంఘాలు సిద్ధం.. మరికాసేపట్లో నిర్ణయం

పీఆర్సీ సాధన సమితి మరోమారు సమావేశమయింది. అయితే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు

Update: 2022-01-31 06:12 GMT

పీఆర్సీ సాధన సమితి మరోమారు సమావేశమయింది. అయితే మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. పీఆర్సీపై చర్చలకు మరోసారి వెళతారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఒకసారి చర్చలకు వెళ్లి తమ డిమాండ్లను గట్టిగా విన్పించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా ఉద్యోగ సంఘాలు రావడం లేదని మంత్రుల కమిటీ చెబుతోంది.

చలో విజయవాడపై.....
అయితే ప్రభుత్వం బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటోందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. తాము పాత జీతాలు చెల్లించమని కోరినా ప్రభుత్వం కొత్త జీతాలనే చెల్లించాలని ముందుకు వెళుతుందన్నారు. అయితే ఒకసారి చర్చలకు వెళ్లి వస్తే తప్పేంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో కాసేపట్లో సమావేశమయ్యే పీఆర్సీ సాధన సమితి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. చర్చలకు వెళ్లి పాత జీతాలను చెల్లించాలని, పీఆర్సీ జీవో రద్దు చేయాలని మరో సారి కోరాలన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.


Tags:    

Similar News