పోసాని ఆరోగ్యంపై కీలక అప్ డేట్
పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత తలెత్తింది. ఆయనను కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోసాని కృష్ణమురళికి స్వల్ప అస్వస్థత తలెత్తింది. రాజంపేట సబ్ జైలులో ఉన్న ఆయనను కడప జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోసాని కృష్ణమురళి గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, అందుకు సంబంధించిన మందులను కూడా వాడుతున్నారని కడప రిమ్స్ వైద్యులు తెలిపారు.
గుండె సంబంధిత...
అయితే ఆయనకు విరోచనాలు కావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారని కడప రిమ్స్ వైద్యులు తెలిపారు. పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పోసాని కృష్ణ మురళి పై ఏపీలో వరస కేసులు నమోదు కావడంతో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు రైల్వే కోడూరు కోర్టు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది.