కుప్పంలో భారీ పోలింగ్... ఎవరి వైపు?

కుప్పంలో పోలింగ్ ముగిసింది. దాదాపు ఎనభై శాతం ఓట్లు నమోదయినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు బారులు తీరారు.

Update: 2021-11-15 12:51 GMT


కుప్పంలో పోలింగ్ ముగిసింది. దాదాపు ఎనభై శాతం ఓట్లు నమోదయినట్లు తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకే అరవై శాతం ఓట్లు నమోదవ్వడం రికార్డు అని చెప్పుకోవాలి. పోలింగ్ సమయం ముగిసే నాటికి క్యూలైన్ లో ఉన్న వారందరికీ అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 12 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ లకు జరిగిన పోలింగ్ ముగిసింది.
అధిక పోలింగ్ ...?
కుప్పంలో భారీ పోలింగ్ జరగడం తమకు అనుకూలమేనని అధికార వైసీపీ చెబుతోంది. కానీ విపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజలు ప్రభుత్వంపైన ఉన్న వ్యతిరేకతతోనే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారని చెబుతున్నారు. హుజూరాబాద్ లో కూడా అధిక పోలింగ్ విపక్షానికి లాభించిందన్న లెక్కలు వేస్తున్నారు. వైసీపీ అన్యాయాలను, అరాచకాలను చూసి ప్రజలే స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారని టీడీపీ నేతలు అంటుండగా, సంక్షేమ కార్యక్రమాలను చూసి పోటెత్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News