నేడు కూడా గోరంట్ల మాధవ్ విచారణ
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నేడు కూడా పోలీసులు విచారించనున్నారు
హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను నేడు కూడా పోలీసులు విచారించనున్నారు. గుంటూరు కోర్టు రెండు రోజుల పాటు నగర పాలెం పోలీసులకు గోరంట్ల మాధవ్ ను కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో నిన్న రాజమండ్రి జైలులో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ కు వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు.
రెండు రోజుల పాటు...
వైఎస్ జగన్ సతీమణి భారతిని అనుచితంగా వ్యాఖ్యలు చేసిన కేసులో ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ను అరెస్ట్ చేసిన సమయంలో అతనిపై దాడికి గోరంట్ల మాధవ్ ప్రయత్నించారని, పోలీసుల విధులకు అడ్డుకున్నారంటూ కేసులు నమోదయ్యాయి. అయితే ఆ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడటం కూడా ప్రభుత్వం ఆగ్రహానికి కారణమయింది. నేడు ప్రశ్నించిన తర్వాత గోరంట్ల మాధవ్ ను తిరిగి రాజమండ్రి జైలుకు అప్పగించనున్నారు.