Posani Krishna Murali : నేడు రెండో రోజు పోసాని విచారణ
సినీనటుడు పోసాని కృష్ణమురళిని నేడు రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు.
సినీనటుడు పోసాని కృష్ణమురళిని నేడు రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. ఈరోజుతో ఆయన కస్టడీ ముగియనుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలపై పోసాని కృష్ణమురళిపై పోలీసులు ఏపీ వ్యాప్తంగా పదిహేడు కేసుల వరకూ నమోదయ్యాయి.
కర్నూలు జిల్లా జైలులో...
ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కర్నూలు జైలులో ఉన్న పోసానిని ఈ కేసులో విచారించాలని కస్టడీ పిటీషన్ వేశారు. ఈరోజు పోసాని కృష్ణమురళిని రెండో రోజు పోలీసులు విచారించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరస కేసులు నమోదు అవుతుండటంతో పోసాని హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లను తిప్పుతున్నారని, తన ఆరోగ్యం బాగాలేదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.