Ys Jagan : జగన్ పై దాడి ఆ భవనంలో నుంచే జరిగిందా? పోలీసుల అనుమానం నిజమేనా?

వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనంపైకి రాయితో దాడి చేశారంటే పక్కా ప్లాన్ తో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు

Update: 2024-04-14 02:53 GMT

వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనంపైకి రాయితో దాడి చేశారంటే పక్కా ప్లాన్ తో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే సంఘటన జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ వివేకానంద స్కూలు ఒకటి ఉంది. ఆ స్కూలు రాత్రి కావడంతో మూసి ఉంది. ఈ స్కూలు బిల్డింగ్ పై నుంచి నిందితుడు రాయి దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూలులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వివేకానంద స్కూలు రెండతస్తుల బిల్డింగ్ లో ఉంది. అయితే కొన్ని రూంల కిటికీల తలుపులు తెరిచి ఉండటాన్ని కూడా పోలీసులు ఈ భవనంపై నుంచి దాడికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వివేకానంద స్కూలులో....
విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. రాత్రి వేళలో స్కూలులో ఎవరూ లేరని భావించి నిందితులు ఈ స్కూలు భవనాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ రెండో అంతస్థులో నుంచి రాయి విసరడంలో సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రెండో అంతస్థు నుంచి విసిరినా అంత వేగంగా వచ్చి నుదుటి భాగాన గురి చూసి కొట్టారంటే అది కావాలని చేసిన పనేనన్నది పోలీసుల అనుమానం. అందుకే ఇది చేతితో విసిరితే అంత తీవ్రంగా.. నుదుటిపై లోతుగా అంత గాయం కాదన్నది పోలీసులు ప్రాధమికంగా అంచనా వేసుకుంటున్నారు.
తప్పించుకోవడానికి వీలుగా...
జగన్ పై దాడి చేయడానికి క్యాట్ బాల్ కాని, ఎయిర్ గన్ గాని ఉపయోగించి ఉండవచ్చన్న కోణంలో ఈ దర్యాప్తును పోలీసులు చేస్తున్నారు. వివేకానంద స్కూలులో మాత్రం సీసీ టీవీ కెమెరాలున్నాయి. వాటిని పరిశీలిస్తే ఆ భవనంలోకి ఎవరెవరు ప్రవేశించారన్నది తెలియనుంది. వారిలో అనుమానితులను గుర్తించే వీలుంది. నిందితుడు ఒక్కడే అయి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. చెట్లు లేని ప్రాంతం చూసుకోవడం, విద్యుత్తు లేకుండా సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడంతో ఎక్స్‌పెర్ట్ ను సీఎం జగన్ పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. దాడి చేసిన తర్వాత అక్కడి నుంచి సులువుగా తప్పించుకునే వీలును పరిశీలించిన తర్వాతనే నిందితుడు ఎంచుకున్న ప్రాంతాన్ని బట్టి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఆకతాయి చేసిన పని కాదని, కావాలని చేసినదేనని అని మాత్రం పోలీసు ఉన్నతాధికారులు సయితం అంగీకరిస్తున్నారు.


Tags:    

Similar News