రాజ్ కసిరెడ్డిని కస్టడీకి కోరే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పోలీసుల విచారణ ముగిసింది
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పోలీసుల విచారణ ముగిసింది. వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం ద్వారా చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న రాత్రి శంషాబాద్ లో రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకు వచ్చి విచారించారు. అయితే మద్యం కుంభకోణంలో ఎవరి ప్రమేయం ఎంత ఉందన్న దానిపై రాజ్ కసిరెడ్డిని పలు ప్రశ్నలతో సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలిసింది.
వైద్య పరీక్షల అనంతరం...
అయితే తనకు డబ్బులు ఎక్కడకు వెళ్లాయో తెలియదంటూ రాజ్ కసిరెడ్డి ఒకే సమాధానం ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇచ్చారు. సరైన సమాధానంఇవ్వకపోడంతో కస్టడీలోకి తీసుకుని 24గంటలు కావడంతో ఆయనను విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను కూడా సిట్ అధికారులు సిద్ధం చేశారు. వైద్యపరీక్షల తర్వాత రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీో కోర్టులో హాజరుపర్చనున్నారు. రేపు కసిరెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటీషన్ వేసి మరోసారి విచారించాలని నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చినట్లు తెలిసింది.