వల్లభనేని వంశీ విచారణ కోసం?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసు విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఆయనను ఈరోజు నుంచి పోలీసులు విచారించనున్నారు. న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి వంశీ విచారణ జరగనుంది.
న్యాయస్థానా ఆదేశాల మేరకు...
ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వల్లభనేని వంశీని విచారణ చేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ, సత్యవర్ధన్ ను కిడ్నాప్, బెదిరించారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సూచన మేరకు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయనున్నారు.