వైసీపీ నేత చెవిరెడ్డికి నోటీసులు
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41 ఎ కింద ఈ నోటీసులు జారీ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రగొండ పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసులో విచారించేందుకు పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ ను...
ఎన్నికల సందర్భంగా యర్రగొండపాలెంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసులకు సంబంధించి యర్రగొండ పాలెం పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని కోరారు. దీంతో చెవిరెడ్డి విచారణకు హజరవుతారా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.