టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వద్ద టెన్షన్

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Update: 2025-08-24 05:00 GMT

అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి తరలివస్తారన్న సమాచారంతో ఆయన ఇంటి వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొందరు ఆయన ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్...
జూనియర్ ఎన్టీఆర్ పైనా, ఆయన తల్లిపైనా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వస్తారని భావించిన పోలీసులు చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటుచేశారు. ఇటీవల వార్ 2 మూవీ విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పై దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది.


Tags:    

Similar News