నూర్ కు ఐదు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు : డీఎస్పీ

సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Update: 2025-08-16 08:14 GMT

సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదులతో సంబంధాలున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు కాదని, స్థానిక పోలీసులు మాత్రమే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతనిని విచారిస్తున్నారు. ధర్మవరం ప్రాంతానికి చెందిన నూర్ ఐదు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు నెరుపుతున్నారని డీఎస్పీ చెప్పారు.

బిర్యానీ హోటల్ లో...
ధర్మవరం కోట కాలనీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక బిర్యానీ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ఉగ్రవాదులతో నూర్ కు సంబంధాలపైపోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని డీఎస్పీ తెలిపారు. తాము విచారించి అతని నుంచి రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని, అనేక కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News