Ys Jagan : విశాఖ జగన్ రోడ్ షోకు నో పర్మిషన్
ఈ నెల 9వ తేదీన విశాఖలో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వలేదు
ఈ నెల 9వ తేదీన విశాఖలో జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జగన్ రోడ్ షోకు అనుమతి లేదని విశాఖ జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు. ఇటీవల కరూర్ లో జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రోడ్ షోకు మాత్రం అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ తెలిపారు.
కొన్ని వాహనాలకు మాత్రమే...
జగన్ వెంట కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దీంతో పాటు విశాఖలో అంతర్జాతీయ మహిళ క్రికెట్ మ్యాచ్ కూడా ఉందని, అందువల్ల రోడ్ షోలకు అనుమతి ఇవ్వలేదని, విశాఖలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ తమకు అనుమతించిన కాన్వాయ్ తో మాత్రమే పర్యటించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.