Ys Jagan : సెక్యూరిటీ లోపం ఉందా? సీఎం సెక్యూరిటీ అంత బలహీనంగా ఉందా?

వైఎస్ జగన్ పై రాయి దాడిని పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

Update: 2024-04-14 02:30 GMT

వైఎస్ జగన్ పై రాయి దాడిని పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు అత్యంత భద్రత ఉంటుంది. ఆయన చుట్టుపక్కల అందరూ సుశిక్షితులైన పోలీసులుంటారు. అంతే కాదు పూలు విసిరినా అవి తగలకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగిస్తారు. అలాంటి సమయంలో జగన్ ఎడమ కంటి కింది భాగంలో గాయం కావడంతో కొంత పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నా.. అసలు ఈ దాడి జరుగుతుంటే సెక్యూరిటీ ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పథ్నాలుగు రోజుల నుంచి...
జగన్ గత పథ్నాలుగు రోజుల నుంచి జనంలోనే ఉన్నారు. బస్సు యాత్ర చేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఆయన గత నెల 27వ తేదీ బయలుదేరి రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు వంటి జిల్లాల్లోనూ ఆయన రోడ్ షోలు నిర్వహించారు. కానీ విజయవాడలోనే ఈ దాడి జరగడానికి కారణం ఏంటన్న చర్చ జరగుతుంది. అక్కడయితేనే నిందితుడు తప్పించుకోవడానికి వీలుగా ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరో పక్కా ప్లాన్ తో విద్యుత్తు సరఫరా లేని సమయం చూసి మరీ అటాక్ చేయడం అంటే కావాలనే చేసినట్లుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు జగన్ భద్రతను మరింత పెంచారు.
మోదీ దిగ్భ్రాంతి....
విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిిన దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఆయన త్వరగా కోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సయితం జగన్ పై జరిగిన రాయి దాడిపై స్పందించారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా జగన్ పై జరిగిన దాడిపై స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు జరగడం విచారకరమని ఆమె అన్నారు. జగనన్న త్వరగా కోలోకుని తిరిగి ప్రచారంలో పాల్గొనాలని ఆమె ప్రార్ధించారు.


Tags:    

Similar News