పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు

ికొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ తెలిపారు.

Update: 2022-01-27 08:56 GMT

ికొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయకుమార్ తెలిపారు. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత ప్రకారం జిల్లాలను విభజించామని ఆయన తెలిపారు. సాంఘిక, సంస్కృతి ప్రకారం జిల్లాల విభజన జరిగిందని విజయకుమార్ తెలిపారు. పరిపాలన సౌలభ్యత కోసమే జిల్లాల విభజన చేశామని, ఇందులో వేరే అభిప్రాయాలు లేవని తెలిపారు. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రతను అనుసరించే విభజన జరిగిందన్నారు.

అతి పెద్ద జిల్లాలు...
26 జిల్లాల్లో అతి పెద్ద జిల్లాలుగా ప్రకాశం, నంద్యాల విస్తీర్ణంలో నిలిచాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు జిల్లాల్లో నల్లమల ఫారెస్ట్ ఎక్కువ భాగం ఉందని విజయకుమార్ చెప్పారు. చిన్న జిల్లాగా విశాఖ పట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువయినా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, ఇక్కడ ఇరవై లక్షల మంది ఉన్నారని తెలిపారు. చారిత్రక నేపథ్యాలను చూసి కూడా జిల్లాలను విభజించడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని విజయకుమార్ చెప్పారు. అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలియచేయవచ్చని ఆయన సూచించారు.


Tags:    

Similar News