మాజీ ఎమ్మెల్యే పులపర్తి మృతి

పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు

Update: 2022-07-07 04:03 GMT

మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి మృతి చెందారు. గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో ఆయన మరణించారు. 1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన నగరం నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

రెండుసార్లు...
2014లో తిరిగి టీడీపీ నుంచి పి. గన్నవరం నియోజకవర్గం నుంచి నారాయణమూర్తి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకపోవడంతో బీజేపీలో చేరారు. తర్వాత ఆ పార్టీ నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న నారాయణమూర్తి మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. నారాయణమూర్తి కుటుంబానికి సానుభూతి తెలిపారు.


Tags:    

Similar News