తిరుమలకు పోటెత్తిన భక్తులు.. 48 గంటల సమయం

పెరటాసి మాసం మూడో శనివారం కావడం, వరస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసి పోతుంది

Update: 2022-10-08 03:48 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత రష్ ఏర్పడింది. పెరటాసి మాసం మూడో శనివారం కావడం, వరస సెలవులు రావడంతో తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసి పోతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు కూడా నిండిపోయాయి. నినన గోగర్భం డ్యామ్ వరకూ క్యూ లైన్ చేరుకుంది. భక్తులకు శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుంది. వసతి గృహాలు లేకపోవడంతో భక్తులకు యాత్రికుల సముదాయంలోనే విశ్రాంతి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.

నిన్న హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 70,007 మంది భక్తులు దర్శించుకున్నారు. 42,866 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలలో ఆరు కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ ఉందని అధికారులు చెబుతన్నారు. నిన్న క్యూ లైన్లను టీటీడీ నిలిపి వేసి ఈరోజు ఉదయం నుంచి తిరిగి ప్రారంభించింది.


Tags:    

Similar News