East Goadavari : నీట మునిగిన లంక గ్రామాలు

భారీ వర్షాలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక గ్రాామాలు నీట మునిగాయి

Update: 2025-08-23 05:55 GMT

భారీ వర్షాలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే వరద ముంపులో ముమ్మిడివరం నియోజకవర్గం నెలకొంది. జలదిగ్భంధంలో లంక గ్రామాలు చిక్కుకున్నాయి. అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్నారు.

రాకపోకలు నిలిచిపోయి...
లంక గ్రామాలైన లంక ఆఫ్ ఠాణేలంక, కూనాలంక, గురజాపులంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు నివాసాలను వరద నీరు చుట్టిముట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలు లేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అయితే గోదావరి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News