పింఛను దారులకు ఏపీ ప్రభుత్వం తాజా కబురు ఇదే

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పంపిణీ తేదీని పొడిగించింది. పింఛన్ల పంపిణీకి చివరి తేదీ ఆగస్టు 4 వరకుగా నిర్ణయించారు

Update: 2025-08-03 05:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ పంపిణీ తేదీని పొడిగించింది. పింఛన్ల పంపిణీకి చివరి తేదీ ఆగస్టు 4 వరకుగా నిర్ణయించారు. ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమయిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో పింఛన్ల పంపిణీలో జాప్యం జరగకుండా ఆంధ్రప్రదేశ్ అధికారులు అవసరమైన చర్యల్లో భాగంగా గడువు పొడిగించారు.

గడువు పొడిగిస్తూ...
దీంతో పాటు సచివాలయ సిబ్బందిని బదిలీలు చేశారు. కొత్తగా ఆయా ప్రాంతాలకు బదిలీ చేసిన సచివాలయం అధికారికి ఆయా ప్రాంతాల పింఛను లబ్ధిదారుల గుర్తింపులో ఆలస్యం జరిగినందుకు పింఛను పంపిణీని 4 వ తేదీ వరకు పొడిగించారు. కావున సదరు లబ్దిదారులు చింతించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.


Tags:    

Similar News