పాకీజాకు సాయం అందించిన పవన్
సినీ నటి వాసుకికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు.
సినీ నటి వాసుకికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకీజా తనను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు వీడియో ద్వారా కోరారు. పాకీజా దీనస్థితికి చలించిన పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. పవన్ కళ్యాణ్ తరఫున శాసనమండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సదరు మొత్తాన్ని ఆమెకు అందజేశారు. మంగళగిరిలో జనసేన ఆఫీసుకు పాకీజాను పిలిపించి సొమ్మును అందజేశారు.