Nagababu : రాజ్యసభ పదవిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

రాజ్యసభ పదవిపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-11-29 06:26 GMT

రాజ్యసభ పదవిపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయ పదవులపై ఎలాంటి ఆసక్తి లేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఒకటి జనసేకు ఇస్తారని, అదీ నాగబాబుకు కేటాయిస్తారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుంది. అయితే నాగబాబు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

ఎక్స్ లో ట్వీట్ చేస్తూ...
తనకు ఎలాంటి రాజీకీయ పదవులపై ఆసక్తి లేదని తెలిపారు. దీంతో నాగబాబుకు రాజ్యసభ పదవి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. అయితే మూడు రాజ్యసభస్థానాల్లో మూడింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారా? లేక అందులో ఒకటి బీజేపీకి కేటాయిస్తారా? అన్నది నాగబాబు కామెంట్స్ తో ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News