నేటి నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర బుధవారం నుండి ప్రారంభం కానుంది.

Update: 2023-06-14 03:44 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర బుధవారం నుండి ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ జూన్ 23 వరకు ఖరారైంది. పది రోజులు తొమ్మిది నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు. ఇక్కడి నుంచే జనసేనాని తన ప్రసంగం ఇవ్వనున్నారు. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.

ఈరోజు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుడిని దర్శించుకుంటారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడికి ర్యాలీగా వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈరోజు రాత్రికి గొల్లప్రోలు‌లో పవన్ బస చేస్తారు. పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగుతుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ సమస్యలతో సతమతమవుతూ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో 'జనవాణి' కార్యక్రమం చేపడతారు. ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు స్వీకరిస్తారు.


Tags:    

Similar News