Pawan Kalyan : స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్
ఎర్ర చందనం స్మగర్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు
ఎర్ర చందనం స్మగర్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆపకుంటే ఆపరేషన్ కగార్ లా స్మగ్లర్లపై ఆపరేషన్ చేపడతామని తెలిపారు. ఖబడ్దార్ అని హెచ్చరించారు. శ్రీవారి భక్తులకు ఇబ్బందులు లేకుండా, అలాగే పర్యావరణానికి ముప్పు లేకుండా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఎర్ర చందనం చెట్లను కొట్టివేయడం నేరమన్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసినా పట్టుకునే సామర్థ్యం తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు.
గత ఐదేళ్లలో...
గత ఐదేళ్లలో వందల కోట్ల రూపాయల ఎర్ర చందనం స్మగ్లింగ్ చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. అంతకు ముందు ఆయన మంగళంలోని ఎర్రచందనం గోదామును ఆయన సందర్శించారు. అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్ర చందనం అత్యంత విలువైనదని, వాటిని నరికి వేయడం స్మగ్లర్లు వారంతట వారు మానుకుంటే మేలని, లేకుంటే తీవ్ర చర్యలుంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎర్రచందనం చెట్లను కాపాడాల్సిన బాధ్యత కేవలం అటవీ శాఖ మీద మాత్రమే కాకుండా ప్రజలపై కూడా ఉందని అన్నారు.