Pawan Kalyan : నేడు శాంతిభద్రతలపై పవన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు రెండో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు రెండో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలో శాంతి భద్రతలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ, ఇతరత్రా కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టే వారిని ఉపేక్షించవద్దని ఆదేశించనున్నారు.
పలు అభివృద్ధి పనులకు...
ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి ఘటనలతో ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయని, వాటిని ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని సూచించనున్నారు. అలాగే తర్వాత రంగరాయ మెడికల్ కళాశాలలో పది కోట్ల రూపాయలతో నిర్మించనున్న పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపనలు చేయనున్నారు.