Pawan Kalyan : పొలాల్లో పవన్ కల్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు

Update: 2025-10-30 07:04 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మొంథా తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. తుపానుకు దెబ్బతిన్న పంటలను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఆయన పొలాల్లోకి వెళ్లి జరిగిన నష్టాన్ని చూశారు. బాధిత రైతులతో మాట్లాడి పంటకు పెట్టిన పెట్టుబడి, ఖర్చు వివరాలను తెలుసుకుంటున్నారు.

అన్నదాతలకు భరోసా...
అలాగే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. త్వరలోనే వ్యవసాయ అధికారులు నష్టం అంచనాలు రూపొందిస్తారని, అందరికీ తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెబుతున్నారు. ధైర్యం కోల్పోవద్దని వారికి సూచించారు. ప్రభుత్వం తప్పనిసరిగా అన్నదాతలకు అండగా ఉండి అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలిపారు.


Tags:    

Similar News