Ap BJP : ఏపీ బీజేపీ అధ్యక్షడిగా మాధవ్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసినట్లు తెలిసింది

Update: 2025-06-30 04:40 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును పార్టీ నాయకత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నామినేషన్ వేయాలంటూ పార్టీ అధినాయకత్వం మాధవ్ ను ఆదేశించింది. ఉదయం పదకొండుగంటలకు మాధవ్ నామినేషన్ వేసే అవకాశాలున్నాయి. పార్టీలో సీనియారిటీతో పాటు సిన్సియారిటీకి అవకాశం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అనేక మంది పోటీ పడుతున్నా...
ఏపీ బీజేపీ అభ్యర్థి పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు.మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు పోటీ పడినా చివరకు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కుటుంబం కావడంతో పాటు కుటుంబ నేపథ్యం కూడా మాధవ్ కు ఈ పదవికి ఎంపిక చేయడానికి కలసి వచ్చినట్లుకనపడుతుంది.


Tags:    

Similar News