సీబీఎన్ పుట్టిన రోజున భాష్యం విన్నూత్న ఆలోచన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా ఆలోచన చేసిన భాష్యం విద్యాసంస్థలు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చంద్రబాబు పేరిట టీటీడీ అన్న వితరణకు ఒకరోజు విరాళాన్నిప్రకటించారు.
నలభై నాలుగు లక్షల రూపాయలను...
ఈ మేరకు ఆయన నలభై నాలుగు లక్షల రూపాయలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించారు. చంద్రబాబు పుట్టిన రోజు నాడు ఒకరోజు తిరుమలకు వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణచేవారు. నలభై నాలుగు లక్షల రూపాయల చెక్కును అందించిన భాష్యం రామకృష్ణ పేరిట ఈరోజు అన్న ప్రసాద వితరణ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.