Andhra Pradesh : నేడు సత్యసాయి జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యసాయి జిల్లాలో పాల్గొననున్నారు

Update: 2025-07-10 02:08 GMT

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై చర్చించనున్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్, డ్రగ్ ఎడిక్షన్ అంశాలపై నిపుణులతో అవగాహన కార్యక్రమాన్నినిర్వహిస్తారు. గిన్నిస్ బుక్ రికార్డ్ దిశగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది.

పేరెంట్ టీచర్ మీటింగ్ లో....
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒకే రోజు రెండు కోట్ల మందితోఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. కొత్తచెరువు పాఠశాలలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొననున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొననున్నారు.


Tags:    

Similar News