నేడు పైడితల్లి సిరిమానోత్సవం

నేడు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం జరగనుంది.

Update: 2025-10-07 03:24 GMT

నేడు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం జరగనుంది. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇప్పటికే విజయనగరం భక్త జనం సంద్రమయింది. కేవలం విజయనగరం మాత్రమే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఐదు లక్షల మంది భక్తులు...
విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవానికి ఐదు లక్షలమంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హుకుంపేట నుంచి సిరిమాను రధాలు కదలనున్నాయి. ఈరోజు పైడితల్లి సిరిమాను ఉత్సవం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరుపున సమర్పించనున్నారు.


Tags:    

Similar News