ఏపీలో ఊహించని సక్సెస్ ను అందుకున్న వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్

అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం

Update: 2024-02-15 14:51 GMT

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యలు చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాల వారికి చేయూతనిచ్చే పథకాలను అమలు చేస్తున్నారు. వివిధ వృత్తుల వారు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా వారివారి సొంత జిల్లాల్లోనే ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రచించింది. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) కార్యక్రమాన్ని తీసుకుని వచ్చింది. ఇది ప్రత్యేకించి చేతివృత్తుల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం కళాకారుల జీవనోపాధిని తీసుకుని వచ్చింది. ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.

అరకు కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ ను అందుకుంది. రాష్ట్రం అంతర్గత వనరులను గుర్తించి, ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్‌ (ఓడీఓపీ) చొరవ అట్టడుగు వర్గాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది. ప్రపంచ మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్ నుండి అందించగలిగే ప్రత్యేకమైన, విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా ప్రపంచ మార్కెట్‌లో ఆంధ్రప్రదేశ్ లోని వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం. వలసలను అరికట్టడంలో ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చింది. స్థానికంగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉపాధి కోసం కార్మికులు పెద్దఎత్తున వలస వెళ్లడాన్ని అడ్డుకుంది.
యూనిటీ మాల్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం చేసిన పనులను కూడా మరచిపోకూడదు. విశాఖపట్నంలో 5 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. యూనిటీ మాల్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ODOP) కోసం డైనమిక్ మార్కెట్ ప్లేస్, ఎగ్జిబిషన్ సెంటర్‌గా మారింది. ఏపీలో గొప్ప చేతి వృత్తులను, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విభిన్నమైన చేతి వృత్తులను ప్రదర్శించడానికి వేదికగా మారనుంది. ఇంకా వివిధ రంగాలలోని కళాకారులకు సహాయం చేయడానికి మరిన్ని సంస్థలలో సహకారాలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీలో ODOP చొరవ.. సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికేనని స్పష్టంగా తెలుస్తోంది.


Tags:    

Similar News