Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

Update: 2025-08-20 02:29 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. నేడు చంద్రబాబు నాయడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఉదయం 10.40 గంటలకు మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ కు బయల్దేరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు.

వివిధ శాఖలపై సమీక్ష...
ఉదయం పదకొండు గంటలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు సచివాలయానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు నరేగాపై చంద్రబాబు నాయుడు సమీక్ష చేయనున్నారు. 3.20 గంటలకు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేయనున్నారు. 6.30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు


Tags:    

Similar News