Tirumala : ఆదివారం కూడా పెద్దగా రష్ లేదే?

తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. వీకెండ్ లో ఉండాల్సిన రష్ లేదు

Update: 2024-01-07 05:19 GMT

number of devotees in tirumala is normal.    

తిరుమలలో భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. వీకెండ్ లో ఉండాల్సిన రష్ లేదు. సాధారణంగా శని, ఆదివారాల్లో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోతాయి. వసతి గృహాలు దొరకడం కూడా కష్టం. మరి ఈ ఆదివారం మాత్రం భక్తుల సంఖ్య పెద్దగా లేదు. పబ్లిక్ పరీక్షల తేదీ దగ్గరపడుతుండటంతో తిరుమలో భక్తుల రాక తగ్గిందన్న ఒక వాదన మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల నుంచి వినిపిస్తుంది.

ఎనిమిది గంటల్లో...
నిన్న తిరుమల శ్రీవారిని 68,793 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,489 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటలలో స్వామి వారి దర్శనం పూర్తవుతుంది.


Tags:    

Similar News