ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఏపీలో మెడికల్ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దరఖాస్తులను ఆహ్వానించింది

Update: 2025-07-23 04:46 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెడికల్, దంత వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు వెంటనే కన్వీనర్ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

అర్హత సాధించిన...
నీట్ తో పాటు యూజీ ప్రవేశ పరీక్ష రాసి స్థానిక ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 29న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకొని పూర్తిచేసి పంపాలని కోరారు. అపరాధ రుసుం ఇరవై వేల రూపాయలతో ఈ నెల 30వ తేదీ ఉదయం 7గంటల నుంచి 31న రాత్రి 9 గంటల్లోగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.


Tags:    

Similar News