BJP : నేడు బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్లు
ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నిన్న నోటిఫికేషన్ విడుదల కావడంతో నేడునామినేషన్ల స్వీకరణ కార్యక్రమంఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ జరుగుతుంది. ఎన్నికల అబ్జర్వర్ గా పీసీ మోహన్ తో పాటు ఎన్నికల అధికారిగా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ వ్యవహరించనున్నారు.
అనేక మంది ఆశావహులు...
మధ్యాహ్నం ఒంటి గంట వరకే నామినేషన్లను స్వీకరిస్తారు. బీజేపీ అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడుతున్నారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరిని కొనసాగిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు కొందరు పోటీ పడుతుండటంతో ఎవరి పేరు ఖరారవుతుందన్నది మధ్యాహ్నానికి తేలే అవకాశముంది.