అమలాపురంలో పోలీసులు ఆంక్షలు పెట్టలేదు: ఎస్పీ

Update: 2023-06-12 02:41 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక జనంలోకి వెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. ఎన్నికల సమర శంఖారావం పూరిస్తూ జనవరి 14 నుంచి వారాహి యాత్ర నిర్వహించనున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వారాహి వాహనానికి పూజలు జరిపించిన అనంతరం పవన్ తన రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభల షెడ్యూల్ ను జనసేన పార్టీ విడుదల చేసింది. జూన్ 14న కత్తిపూడిలో తొలి సభ నిర్వహిస్తారు. తొలి దశలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర తొలి దశ ఉంటుంది. జూన్ 14- కత్తిపూడి సభ, జూన్ 16- పిఠాపురంలో వారాహి యాత్ర, సభ, జూన్ 18- కాకినాడలో వారాహి యాత్ర, సభ, జూన్ 20- ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ, జూన్ 21- అమలాపురంలో వారాహి యాత్ర, సభ, జూన్ 22- పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, మలికిపురంలో సభ, జూన్ 23- నరసాపురంలో వారాహి యాత్ర, సభ.. ఇలా ఆయన పర్యటన సాగనుంది.

పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవడానికి ఏపీ పోలీసులు ఆంక్షలు తీసుకుని వచ్చారని చెబుతూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే తాము ఆంక్షలను విధించలేదని ఏపీ పోలీసు విభాగం తెలిపింది. తాము ఆంక్షలు విధించామని చెప్పడం కరెక్ట్‌ కాదంని అమలాపురం ఎస్పీ చెప్పుకొచ్చారు. సెక్షన్‌ 30 యాక్ట్‌ సాధారణ విధుల్లో భాగమేనని.. ప్రత్యేకించి జనసేన సభల కోసం పెట్టింది కాదని అన్నారు. పవన్‌ కళ్యాణ్ సభ జరిగే ప్రాంతాన్ని, జనసేన నేతలతో కలిసి పరిశీలించారు అమలాపురం డిఎస్పీ. వారాహియాత్ర రూట్‌మ్యాప్‌ను కూడా పరిశీలించారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఆదివారం నుంచి నెలాఖరు వరకు సెక్షన్ 30 యాక్ట్‌ అమలులోకి వచ్చింది. దీంతో వారాహి యాత్రను అడ్డుకునేందుకే పోలీసులు ఆంక్షలు పెట్టారని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందారు. వారాహి యాత్ర కోసం ఆంక్షలు పెట్టలేదని.. అవన్నీ సాధారణ విధుల్లో భాగమేనని అమలాపురం ఎస్పీ చెప్పారు.


Tags:    

Similar News