విజయనగరం ఉగ్రలింక్స్ పై దర్యాప్తు ముమ్మరం
విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసింది.
విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసింది. సిరాజ్, సమీర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరాన్ని తరలించారు. విజయనగరం జిల్లాకు యాంటీ టెర్రర్ స్క్వాడ్ చేరుకున్నారు. వీరి వెనక ఎవరు ఉన్నారు? ఎక్కడెక్కడ బాంబు బ్లాస్ట్ చేయాలని కుట్ర చేశారన్న దానిపై విచారణ సాగుతుంది.
వారం రోజుల పాటు...
ఇప్పటికే నాలుగు రోజులుగా విజయనగరం జిల్లాలోనే ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. సిరాజ్ ఎవరెవరితో టచ్ లోకి వెళ్లారన్న దానిపై విచారణ జరిపే అవకాశముంది. సిరాజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందన్న దానిపై కూడా విచారణ చేయనున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ ఎన్‌ఐఏ అధికారులు చేయనున్నారు. ఏడు రోజుల పాటు సిరాజ్, సమీర్‌ను ఎన్ఐఏ అధికారులు విచారించనున్నారు.