కొత్త జిల్లాలు ఉగాది నాడు కాదట

ఏపీ లో కొత్త జిల్లాలు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జగన్ కొత్త జిల్లాలను ప్రారంభిస్తారు

Update: 2022-03-30 07:54 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు వచ్చే నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్యలో కొత్త జిల్లాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించారు.

ఏప్రిల్ 4 నుంచి.....
ముఖ్యమంత్రి జగన్ అధికారుల సమీక్షలో ఈ విషయం తెలిపారు. ఏప్రిల్ 2న ఉగాది నాడు ప్రారంభం కావాల్సి ఉండగా, రెండు రోజుల పాటు వాయిదా వేశారు. ఏప్రిల్ 6వ తేదీన నరసరావుపేటలో వాలంటీర్లకు సన్మానం చేస్తారు. ఈలోపు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.


Tags:    

Similar News