రొట్టెల పండగకు అంతా సిద్ధం

రొట్టెల పండుగకు నెల్లూరు ముస్తాబయింది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షహీద్ దర్గాలో వేడుకలు జరగనున్నాయి

Update: 2025-07-05 04:24 GMT

రొట్టెల పండుగకు నెల్లూరు ముస్తాబయింది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షహీద్ దర్గాలో వేడుకలు జరగనున్నాయి. కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు భక్తులు మార్చుకునే ఈ పండగకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఒక్కొక్క కోరికకు ఒక్కో రొట్టెను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చాలని కోరుకుంటారు.

ప్రత్యేక ఏర్పాట్లు...
ప్రభుత్వం రొట్టెల పండగ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించింది. ప్రభుత్వం ప్రత్యేక అధికారులను పర్యవేక్షణకు నియమించింది. ప్రభుత్వం రొట్టెల పండగ కోసం వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News