సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. అలెర్ట్ అయిన సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో తృటిలో తప్పిన ఈ ప్రమాదం శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో తృటిలో తప్పిన ఈ ప్రమాదం శ్రీసత్యసాయి జిల్లాలో జరిగింది. రైలులో మంటలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పెద్దగా కేకలు వేయడంతో రైలును నిలిపివేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ సెవెన్ హిల్స్ ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.
ప్రయాణికులు గుర్తించి...
శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరం మండలం చిగచెర్ల రైల్వే స్టేషన్ వద్ద రైలులో మంటలు గుర్తించిన ప్రయాణకులు వెంటనే పెద్దగా కేకలు పెట్టారు. దీంతో లోకో పైలట్ వెంటనే నిలిపివేశారు. అయితే సిబ్బంది మంటలు వచ్చిన ప్రాంతంలో తనిఖీ చేయగా బోగీ చక్రం వద్ద రాపిడికి గురి రావడంతోనే మంటలు వ్యాపించినట్లు గుర్తించిన సిబ్బంది రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన తర్వాత తిరిగి సికింద్రాబాద్ కు రైలు బయలుదేరి వచ్చింది.