Nara Bhuvaneswari : నేటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటన
నేటి నుంచి నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
nara bhuvaneshwari will tour of uttarandhra from today
TDP updates:నేటి నుంచి నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. వారికి పార్టీ తరుపున ఆర్థిక సాయాన్ని అందచేయనున్నారు. ఈరోజు నారా భువనేశ్వరి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
మూడు రోజుల పాటు...
నేటి నుంచి వరసగా మూడు రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. మధ్యలో ఆమె తన నిజం గెలవాలి కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఇచ్చి, నేటి నుంచి పర్యటనలను కొనసాగిస్తున్నారు.