నందిగం సురేష్ కు అస్వస్థత
గుంటూరు జిల్లా జైలులో ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
nandigam suresh bail petition
మాజీ ఎంపీ నందిగామ సురేష్ అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్ లో నందిగామ సురేష్ ను హాస్పటల్ లోకి సిబ్బంది తీసుకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు ఆసుపత్రిలో...
ప్రభుత్వాసుపత్రిలోకి నందిగం సురేష్ కుటుంబ సభ్యులను పోలీసులు అనుమతించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామ సురేష్ కు ఏమైందని పోలీసులు అడుగుతున్న చెప్పటం లేదని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. నందిగం సురేష్ కు వైద్య పరీక్షలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్వహిస్తున్నారు.