TDP : టీడీపీ రాజ్యసభ సభ్యులు వీరే... ఎన్నిక ఏకగ్రీవమే
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల పేర్లను పార్టీ నాయకత్వం అధికారికంగా ఖరారు చేసింది.
satyanarayana passed away
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుల పేర్లను పార్టీ నాయకత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి గడువు కావడంతో రాత్రి టీడీపీ రాజ్యసభ్య సభ్యుల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను ఖరారు చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
మూడు పదవులకు...
త్వరలోనే మూడు రాజ్యసభ పదవులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశముంది. వైసీపికి పదకొండు స్థానాలు మాత్రమే ఉండటంతో పోటీ చేయడానికి కూడా ముందుకు రాదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరు ఖరారు అయింది. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సానా సతీష్, బీద మస్తాన్ రావులు కూడా ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తే ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.